డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ రాశి ఫలితాలను ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

చిత్త 3,4 పాదములు లేదా స్వాతి 1,2,3,4 పాదములు లేదా విశాఖ 1,2,3 పాదములులో జన్మించినవారు తులారాశికి చెందును.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి ఆదాయం 02, వ్యయం - 08, రాజ పూజ్యం - 01, అవమానం - 05

పూర్వ పద్దతి లో తులారాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి కళా రంగ విషయాల్లో , రాజకీయ రంగ విషయాల్లో విజయాన్ని సూచించుచున్నది.

తులారాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి 01 ఏప్రిల్ 2022 వరకు గురు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. 19 నవంబర్ 2021 వరకూ శత్రు విజయాలను ఏర్పరచును. సొంత గృహ యోగం కలుగ చేయును. భూ సంబంధ క్రయ విక్రయాలకు అనుకూలమైన కాలం. మాత్రు వర్గీయుల వలన ఆర్థికం గా లాభములు పొందుదురు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించును.  20 నవంబర్ 2021 నుండి గురువు వలన తులారాశి వారికి అంత అనుకూల ఫలితాలు లభించవు. అనవసర తగాదాలు, ఆరోగ్య సమస్యలు, వృధా ధన వ్యయం, షేర్ మార్కెట్ లేదా  వ్యాపార పెట్టుబడుల్లో నష్టాలు ఏర్పడును. 

అర్దాష్టమ శని ప్రభావం నడుస్తున్నది. 20 నవంబర్ 2021 అశుభ పరిమాణాలే ఎక్కువగా ఉండును. అయిననూ సంవత్సరం అంతా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించును. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారు శని వలన మిక్కిలి లాభములు పొందుదురు. మొత్తం మీద శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా శని తులారాశి వారికి చక్కటి అభివృద్ధి కర ఫలితాలు ఏర్పరచును.

తులా రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు - కేతువు ఇరువురూ వలన ఆర్థికంగా లాభములు ఏర్పడినా మిగిలిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు ఏర్పడవు. ముఖ్యంగా వ్యక్త్రి గత జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు, జీవిత భాగస్వామి సంబంధిత విచారత, సంతాన ప్రయత్నాలు విఫలం మగును. ఎదిగిన సంతానం వ్యవహార శైలి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా రాహు - కేతువు లు యోగించరు. 

* రాజకీయ సంతానం లేనివారికి సంతాన యోగం కలుగుతుంది. ఎన్ని ఉన్న ఎదో లోటుగా మిమ్మల్ని భాదిస్తుంది.చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెదాతాయి. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ఒకప్పుడు మిమ్మల్ని అత్యంత గౌరవించిన వారే బద్దశత్రువులు అవుతారు. సంఘంలో గౌరవం తగ్గడం, అన్నదమ్ములతో ఆత్మీయులతో వైరం, అపకీర్తి, మితిమీరిన విశ్వాసం వలన ఎన్నో రకాలుగా ఇబ్బందులు..ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కున్న అనుకున్న ఉద్యోగం లభించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన జీవితాన్ని ఉత్సాహంగా ప్రారంభిస్తారు. ఎవరో చేసిన పనికి మీరు భాదపడవలసి వస్తుంది. ఇతరులపై పెత్తనం చేయకూడదని నిర్ణయించుకుంటారు.