onion crisis video: ఉల్లి కోసం పోరాటం... కిలో మీటర్ మేర క్యూ
ఆంధ్ర ప్రదేశ్ ఉల్లిపాయల కోసం సామాన్యుల కష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ప్రజలు ప్రభుత్వం అందించే సబ్సిడి ఉల్లిపాయల కోసం ఎగపడుతుండటంతో పరిస్ధితి దారుణంగా తయారవుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ ఉల్లి కొరత ఏ స్థాయిలో వుందో ఈ ఒక్క వీడియోను చూస్తే తెలిసిపోతుంది. గత రెండు రోజులుగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ప్రభుత్వం సబ్సిడి ధరకు ఉల్లిపాయలు అందిస్తోంది. బహిరంగ మార్కెట్ కేజీ ఉల్లి ధర రూ.100-200 పలుకుతుండగా ప్రభుత్వం మాత్రం కేవలం రూ.25 కే కేజీ అందిస్తోంది. దీంతో సబ్సిడి ఉల్లిపాయలు అందించే కేంద్రాల వద్ద సామాన్యులు బారులు తీరారు.
చిలకలూరిపేట రైతు బజార్ వద్ద పరస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. మహిళలు చంటి బిడ్డలను ఎత్తుకుని వచ్చిమరీ కీలోమీటర్ల కొద్దీ క్యూలో నిల్చుని ఉల్లిపాయలు కొంటుకున్నారు. ఇక పురుషులు ఉద్యోగాలు, పనులన్నీ మానుకుని మరీ ఉల్లిపాయల కోసం పోరాడుతున్నారు. ఉల్లికోసం కిలోమీటర్ల మేర వేచివున్న క్యూలైన్ లో ఘర్షణలు, తోపులాటలు కూడా జరిగాయి.