
తిరుమలలో ఉత్కంఠగా భద్రతా బలగాల మాక్ డ్రిల్
తిరుమలలో ఉగ్రదాడులను ఎదుర్కొనే దృష్ట్యా మాక్ డ్రిల్ నిర్వహించారు. కశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) నేపథ్యంలో భక్తుల రక్షణ కోసం, ఉగ్రవాదుల చొరబాటును ఎలా ఎదుర్కోవాలో చూపించేందుకు సుదర్శన్ చౌల్ట్రీ, లేపాక్షి సర్కిల్ వద్ద ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. అదనపు ఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ మాక్ డ్రిల్లులో అక్టోపస్ కమాండోలు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు, ఏపీఎస్పీ సభ్యులు పాల్గొన్నారు. అసాల్ట్ డాగ్, ఎనిమీ అటాక్, రూమ్ ఇంటర్వెన్షన్ వంటి ప్రత్యేకమైన యాక్షన్ కార్యక్రమాలు ప్రదర్శించారు. మొత్తం 28 అక్టోపస్ కమాండోలు, 25 టీటీడీ విజిలెన్స్, 15 పోలీసులు, 10 ఏపీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.