అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రశ్నల వర్షం.. పవన్ సమాధానాలు | AP Assembly | Pawan Kalyan | Asianet Telugu
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమ వారం 12వ రోజు కొనసాగాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేశారు. పలు జిల్లాల్లో అవినీతి జరిగిందని.. ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. వాటికి ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం లో సుమారు రూ.250 కోట్ల మేర అవినీతి జరిగినట్లు గుర్తించామని తెలిపారు. విచారణ జరుగుతోందని.. చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.