
పూంఛ్‌లో పాక్ దాడులు.. గాయపడ్డ ప్రజలకు ఒమర్ అబ్దుల్లా పరామర్శ
పాక్ దాడులతో భారత్ సరిహద్దు ప్రాంతంలోని ఇళ్లు దెబ్బతిన్నాయి. పలువురు ప్రజలు గాయపడ్డారు. పూంఛ్‌లో పాకిస్థాన్ జరిపిన షెల్లింగ్‌లో గాయపడ్డ బాధితులను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరామర్శించారు. జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వివరాలు తెలుసుకొని బాధితులకు ధైర్యం చెప్పారు.