
గద్దర్ అంటే ఒక శక్తి.. ఆయన పేరిట సినిమా అవార్డ్స్ ఇవ్వడం గర్వకారణం
గద్దర్ అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి అని తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన పేరిట సినిమా అవార్డ్స్ ఇవ్వడం గర్వకారణం అని ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో తెలంగాణ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.