
మందు బాటిళ్లతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న లిక్కర్ పాలసీ ద్వారా కోట్లాధి రూపాయలు అక్రమంగా అమరావతిలోని చంద్రబాబు ప్యాలెస్‌కు చేరుతున్నాయని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఏటా నారావారి లిక్కర్ కమీషన్లు అక్షరాలా రూ.2,200 కోట్లు అని ఆరోపించారు. డిస్టిలరీల నుంచి ఏడాదికి రూ.1000 కోట్లు సీఎం చంద్రబాబుకు, లిక్కర్ షాప్‌ల నుంచి ఆయన కుమారుడు నారా లోకేష్‌కు రూ.1200 కోట్లు ముడుపులు అందుతున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు.