Asianet News TeluguAsianet News Telugu

బొడ్డెమ్మను నెత్తినెత్తి, ఆడబిడ్డలతో ఆడిపాడుతూ... బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల :  తెలంగాణ ఆడబిడ్డలు జరుపుకునే పూలపండగ బతుకమ్మ వేడుకలు యావత్ తెలంగాణలో ప్రారంభమయ్యాయి. 

Sep 27, 2022, 11:45 AM IST

జగిత్యాల :  తెలంగాణ ఆడబిడ్డలు జరుపుకునే పూలపండగ బతుకమ్మ వేడుకలు యావత్ తెలంగాణలో ప్రారంభమయ్యాయి. ఎంగిలిపూలతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు తొమ్మిది రోజులపాటు వైభవంగా కొనసాగి సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. ఇలా బతుకమ్మ వేడుకల్లో రెండోరోజయిన నిన్న(మంగళవారం) టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బొడ్డెమ్మను పూజించారు.  జగిత్యాల జిల్లా కోరుట్లలో ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కవిత ఆడబిడ్డలతో కలిసి ఆడిపాడారు. మెట్ పల్లి పట్టణంలోన మినీ స్టేడియంలో ఏర్పాడుచేసిన వేడుకల్లో బతుకమ్మను నెత్తినెత్తిన కవిత స్థానిక మహిళలతో కలిసి ఆడిపాడారు.