సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే చందర్
పెద్దపల్లి: రామగుండంలో సింగరేణి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధన్యవాదాలు తెలిపారు.
పెద్దపల్లి: రామగుండంలో సింగరేణి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో గోదావరిఖనిలోని గాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే చందర్. ఈ కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.