బావిలో తేలిన 9 మృతదేహాలు; తెలియని కారణం, తీవ్ర సంచలనం
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలోని ఓ బావిలో తొమ్మిది మృతదేహాలు బయటపడడం సంచలనం సృష్టిస్తోంది.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలోని ఓ బావిలో తొమ్మిది మృతదేహాలు బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. వీరిలో ఆరుగురు మక్సూద్ అనే వ్యక్తి కుటుంబానికి చెందినవారిగా భావిస్తున్నారు. మక్సూద్ మనవడి జన్మదిన వేడుకల్లో జరిగిన వివాదమే ఈ మరణాలకు కారణమని భావిస్తున్నారు. మక్సూద్ కుటుంబ సభ్యులతో బీహార్ యువకులు కొంత మంది తగాదాకు దిగారు. మక్సూద్ ఇద్దరు కుమారుల కోసం, బీహార్ కు చెందిన ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది సామూహిక ఆత్మహత్య ఘటననా, హత్యనా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.