గీసుకొండ బావిలో 9 శవాల మిస్టరీ: అక్రమ సంబంధమే కారణమా?
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట బావిలోని 9 మృతదేహాల మిస్టరీని ఛేదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆహారంలో విషం కలిపి చంపేసి బావిలో పడేశారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
వరంగల్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో తేలిన 9 మృతదేహాల మిస్టరీని ఛేదించడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత సామూహిక ఆత్మహత్యలుగా పోలీసులు భావించారు. కానీ, హత్యలు కూడా అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఆహారంలో విషం కలిపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమ సంబంధమే ఈ మరణాలకు కారమై ఉండవచ్చునని కూడా భావిస్తున్నారు. ఆర్థిక కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మరణాలకు ఘర్షణ కారణమా, వివాహేతర సంబంధం కారణమా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. మక్సూద్ మనవడి జన్మదిన వేడుకల్లో బీహర్ యువకులతో గొడవ జరిగినట్లు చెబుతున్నారు.
గొర్రెకుంట బావిలో 9 మృతదేహాల ఘటనపై 9 టీములతో దర్యాప్తు: సీపీ రవీందర్
బావిలో తేలిన 9 మృతదేహాల్లో ఆరు ఒకే కుటుంబానికి చెందినవిగా భావిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడిన మక్సూద్ అనే వ్యక్తి కుటుంబానికి చెందినవారని చెబుతున్నారు. పోలీసులు మక్సూద్ ఇద్దరు కుమారుల కోసం, బీహార్ కు చెందిన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా సమాచారం ప్రకారం... పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతను మక్సూద్ కుటుంబ సభ్యుడని సమాచారం. మృతుల్లో మక్సూద్ తో పాటు అతని మూడేళ్ల మనవడు కూడా ఉన్నాడు.
Also Read: హత్యలా, ఆత్మహత్యనా: వరంగల్‌లో బావిలో శవాలుగా తేలిన తొమ్మిది మంది వలస కూలీలు
మూడేళ్ల బాలుడి పేరు తెలియడం లేదు. మిగిలినవారిని మక్సూద్ (55), నిషా (48), బష్ర ఖతూర్ (22), షాబాద్ ఆలం (21), శ్రీరాం (21), షకీల్ ()30), సోహెల్ ఆలం (18), శ్యామ్ లుగా గుర్తించారు. షకీల్ ను వరంగల్ జిల్లావాసిగా భావిస్తున్నారు. మక్సూద్ కు ఇద్దరు కుమారులున్నారు.
పారిపోయిన బీహార్ యువకులు ఎక్కడున్నారనే విషయాన్ని పోలీసు పరిశీలిస్తున్నారు. హత్య చేసి అందరినీ కలిపి బావిలో పడేశారా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. మక్సూద్ కూతురు బస్రా ఖతూర్ భర్తతో విడిపోయి కుమారుడితో ఇక్కడే ఉంటోంది. కాసేపట్లో మిస్టరీ వీడుతుందని భావిస్తున్నారు.