యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్ తృటిలో తప్పిన ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు పెను ప్రమాదం తప్పింది.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఓ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కలెక్టర్ వాహనం పూర్తిగా దెబ్బతింది. భువనగిరి మండలం అనాజీపురం, నందనం గ్రామాల మధ్య గురువారం (అక్టోబర్ 15) సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వలిగొండ మండలంలోని పలు గ్రామాల్లో.. అకాల వర్షంతో నష్టపోయిన పంట పొలాలను కలెక్టర్ అనితా రామచంద్రన్ గురువారం పరిశీలించారు. అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.