జనాల ప్రాణాలు పోతుంటే.. ప్రోటోకాల్ కావాల్నా.. మండిపడ్డ మంత్రి..

ప్రోలో కాల్ గుర్తు చేసినందుకు మంత్రి గారికి కోపం వచ్చింది. 

First Published Jul 21, 2020, 1:04 PM IST | Last Updated Jul 21, 2020, 1:04 PM IST

ప్రోలో కాల్ గుర్తు చేసినందుకు మంత్రి గారికి కోపం వచ్చింది. కరోనా టైంలో ప్రోటోకాల్ ఎంటీ అంటూ గుర్తు చేసిన వ్యక్తిపై విరుచుకు పడ్డాడు. అంతేకాదు అతన్ని అరెస్ట్ చేసి కేసు పెట్టాలంటూ పోలీసులను పురమాయించాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో కోవిడ్ కేర్ సెంటర్ ఓపెనింగ్ జరిగింది. దీనికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వేదికమీదికి ఎంపిపి, జడ్పీటీసి, ఎమ్మెల్యే, మంత్రి, కలెక్టర్ అందర్నీ పిలిచారు కానీ ఆ గ్రామ సర్పంచ్ ను ఆహ్వానించలేదు. దీంతో ఓ వ్యక్తి సర్పంచ్ ను వేదిక మీదికి పిలవాలి కదా అని గుర్తు చేయడం గొడవకు దారి తీసింది.