userpic
user icon

లాక్ డౌన్ వల్ల ఏ ఒక్క ముస్లిం పండగ చేసుకోకుండా ఉండొద్దు.. మంత్రి మల్లారెడ్డి

Bukka Sumabala  | Published: May 23, 2020, 12:36 PM IST

మేడ్చల్ నియోజకవర్గం తుంకుంటా మునిసిపల్ పరిధిలోని సింగయపల్లిలో రంజాన్ సందర్బంగా ముస్లిం సోదరులకు బియ్యం మరియు నిత్యవసర సరుకులను కార్మిక,ఉపాధి శాఖా మంత్రి  సి.హెచ్ మల్లా రెడ్డి ఈరోజు పంపిణి చేశారు. లాక్ డౌన్ వల్ల రంజాన్ సమయంలో పేద ముస్లింలు ఎవరు 
కూడా ఇబ్బందులు పడకుండా వారు ఈద్ జరుపుకోవాలనేది తమ కోరిక అన్నారు. ఈ సారి రంజాన్ పండుగను అందరూ ఇంట్లోనే జరుపుకోవాలని, ఇంకొద్ది రోజులు ఎవరికివారే స్వీయా నియంత్రణ లో ఉంటే కరోనాను తరిమేయవచ్చన్నారు. ఈ కార్యక్రమం లో తుంకుంటా మున్సిపల్ చైర్మన్ 
రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి, ఎక్స్ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More

Video Top Stories

Must See