జగనన్న బాణం ఒక్కటే... కేసీఆర్ వద్ద వేలాది బాణాలు: షర్మిల పార్టీపై మంత్రి గంగుల
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పార్టీపై బీసీ, సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పార్టీపై బీసీ, సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న బాణం ఒక్కటి వస్తే కెసిఆర్ వేలాది భాణాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సింగిల్ గానే ఉంటుందని... ఏ పార్టీ వచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాదని గంగుల అన్నారు. ఎన్ని బాణాలు వచ్చిన తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడే ఏకైక వ్యక్తి చంద్రశేఖర రావు ఒక్కడే అన్నారు. కనుక రాష్ట్రంలో ఏ బాణం వచ్చిన తిరుగుముఖం పట్టక తప్పదు అన్నారు. తెలంగాణ ప్రజలకు కెసిఆర్ శ్రీరామ రక్షకుడని, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలిగిన అక్కడ ఆయన ఉంటారని మంత్రి పేర్కొన్నారు.