Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం... పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వద్దే హత్యకు యత్నించిన  ఆర్మూరు పరిధిలోని కిల్లెడ గ్రామ సర్పంచ్ గా సస్పెన్షన్ కు గురయిన లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడివద్ద రెండు తుపాకులు, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 

ఇలా అత్యాయత్నం జరిగిన జీవన్ రెడ్డిని ఇప్పటికే పలువురు మంత్రులు, టీఆర్ఎస్  నాయకులు పరామర్శించారు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. హత్యాయత్నానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని ధైర్యంగా వుండాలని జీవన్ రెడ్డికి సూచించారు. ఇప్పటికే మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులు కూడా జీవన్ రెడ్డిని పరామర్శించారు. 

Video Top Stories