Asianet News TeluguAsianet News Telugu

త్రివర్ణ పతాకాలో సందడిగా మల్లారెడ్డి కాలేజీ ప్రాగణం... అద్భుతంగా సాగిన జాతీయ గీతాలాపన

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలు జరుపుతోంది.

First Published Aug 16, 2022, 3:12 PM IST | Last Updated Aug 16, 2022, 3:12 PM IST

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ మైసమ్మగూడ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో  ఆర్థిక మంత్రి హరీశ్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో దాదాపు 30వేలమంది యువతీ యువకులు జాతీయ పతాకాలు చేతపట్టి జాతీయ గీతాలాపన చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇక నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని మిని ట్యాంక్ బండ్ పై నిర్వ‌హించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కూడా జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాలగొన్నారు.