
హైదరాబాద్‌లో రాకెట్ల తయారీ కేంద్రం.. లోపల ఎలా ఉంటుందో చూడండి
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ ‘ఇన్‌ఫినిటీ క్యాంపస్’, తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ ‘విక్రం–1’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కొత్త దశ మొదలవుతోంది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ క్యాంపస్.. ఉపగ్రహ ప్రయోగాల తయారీకి, ప్రైవేట్ రంగం అంతరిక్ష సామర్థ్య విస్తరణకు కీలకంగా మారనుంది.విక్రం–1 రాకెట్ పూర్తిగా ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన తొలి క్షిపణిగా అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఇది చిన్న, మధ్య తరహా ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడంలో ముఖ్య పాత్ర పోషించనుంది.ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్‌కు మరింత గౌరవం తీసుకొచ్చే ఈ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, యువతలో భారీ ఉత్సాహం నెలకొంది.