పోటాపోటిగా కాంగ్రెస్, టీఆర్ఎస్ ‘చలో మల్లారం’.. మంథనిలో శ్రీధర్ బాబు అరెస్ట్..
భూపాలపల్లి జిల్లా మల్లారంలో ఇటీవల జరిగిన దళిత యువకుడి హత్యను నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన చలో మల్లారం యాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
భూపాలపల్లి జిల్లా మల్లారంలో ఇటీవల జరిగిన దళిత యువకుడి హత్యను నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన చలో మల్లారం యాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంథని నుంచి కాన్వాయ్‌తో బయలుదేరగా పోలీసులు అడ్డుకుని మంథని స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 6న మల్లారంలో చనిపోయిన దళితుడు రేవెళ్లి రాజబాబు చనిపోవడంతో రేగిన వివాదం టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో నిజనిర్థారణ కోసం ఇరు పార్టీలు పోటాపోటీగా ఛలో మల్లారం పిలుపునిచ్చాయి.