Asianet News TeluguAsianet News Telugu

పని ప్రదేశాల్లోనే వలసకార్మికుల రిజిస్ట్రేషన్.. ఈ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు..

పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్‌కుమార్‌తో క‌లిసి హైదరాబాద్ నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ రాయ‌దుర్గ్‌లో ఉన్న మైహోం హ‌బ్ లో ప‌నిచేస్తున్న వ‌ల‌స కార్మికుల‌తో మాట్లాడారు. 

పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్‌కుమార్‌తో క‌లిసి హైదరాబాద్ నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ రాయ‌దుర్గ్‌లో ఉన్న మైహోం హ‌బ్ లో ప‌నిచేస్తున్న వ‌ల‌స కార్మికుల‌తో మాట్లాడారు.  ఆయా రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటుచేసి వ‌ల‌స కార్మికుల‌ను వారి స్వ‌స్థ‌లాల‌కు పంపేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం రూ. 4 కోట్ల నిధుల‌ను రైల్వే శాఖ‌కు చెల్లించిన‌ట్లు తెలిపారు. అయితే ఒకే రోజు ఎక్కువ రైళ్ల‌ను ఆయా రాష్ట్రాల‌కు పంపుట‌కు మ‌నం సిద్దంగా ఉన్నామ‌ని తెలిపారు. వ‌ల‌స కార్మికుల‌ను స్వస్థలాలకు  పంపుట‌కు నిర్మాణ ప్ర‌దేశాల్లోనే రిజిస్ట్రేష‌న్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. రిజిస్ట్రేష‌న్ ప్ర‌కారం త‌మ వంతు వ‌చ్చేవ‌ర‌కు ఓపిక‌తో వేచి ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. రైలు దొర‌క‌దు అనే ఆందోళ‌న వ‌ద్ద‌ని సూచించారు. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు అన్ని రాష్ట్రాల‌కు తెలంగాణ నుండి వ‌ల‌స కార్మికుల ప్ర‌త్యేక రైళ్లు న‌డుస్తాయ‌ని తెలిపారు. వ‌ల‌స కార్మికుల‌కు ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా అండ‌గా నిలుస్తుంద‌న్నారు.