Asianet News TeluguAsianet News Telugu

సాగు చట్టాలు: మరణించిన రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా.. హిందీలో కేసీఆర్ ప్రకటన (వీడియో)

రైతు ఉద్యమంలో మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రధాని నరేంద్రమోడీకి కేసీఆర్ సూచించారు. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ  తరపు నుంచి రూ.3 లక్షల పరిహారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

రైతుల పోరాటంతోనే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు (Farm laws) రద్దయ్యాయన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (telangana cm kcr) . శనివారం తెలంగాణ భవన్‌లో (telagana bhavan) మీడియాతో మాట్లాడిన ఆయన.. చట్టాలు రద్దు చేసినట్లుగానే, రైతులపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (narendra modi) కేసీఆర్ కోరారు. రైతు ఉద్యమంలో మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన సూచించారు. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ  తరపు నుంచి రూ.3 లక్షల పరిహారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

రైతు పోరాటంలో మరణించిన 750 రైతుల కుటుంబాలకు సాయం అందించనున్నట్లు కేసీఆర్ హిందీలో ప్రకటించడం విశేషం. ఇప్పటికే పేర్లు ఇవ్వాలని రైతు సంఘం నాయకులకు సూచించినట్లు సీఎం తెలిపారు. సారీ చెప్పి చేతులు దులుపుకోవడం కాదని.. ప్రతి కుటుంబానికి కేంద్రం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని.. కేసీఆర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో కూడా ఆత్మనిర్భర్ (atma nirbhar bharat) అమలు చేయాలని ఆయన సూచించారు. 

Video Top Stories