Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో మళ్లీ కరోనా కలకలం... ఒకే గ్రామంలో 28కేసులు (వీడియో)

కరీంనగర్ జిల్లా రూరల్ మండలం చేగుర్తిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న కుటుంబాల్లో పలువురికి వైరస్ సోకింది. దీంతో నిన్నటి(గురువారం) నుంచి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి టెస్టులు చేస్తున్నారు. నిన్న 16 మందికి కరోనా పాజిటివ్ రాగా.. ఇవాళ్టి టెస్టుల్లో 12 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా టెస్ట్ లు కొనసాగుతున్నాయి. 28 పాజిటివ్ కేసులు రావటంతో వీరంతా ఎవరెవరిని కలిశారనే వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. చేగుర్తితో పాటు పక్కనే ఉన్న దుర్శేడు గ్రామానికి చెందిన కొందరు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు తెలియటంతో.. అధికారులు ఆ గ్రామస్తులకు కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తామంటున్నారు.