సీఎల్పీ బృందం కాళేశ్వరం పర్యటన ఉద్రిక్తం... భట్టి విక్రమార్క అరెస్ట్

ములుగు నియోజకవర్గం గంగారం మండల కేంద్రంలో సీఎల్పీ బృందానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. 

First Published Aug 17, 2022, 2:31 PM IST | Last Updated Aug 17, 2022, 2:31 PM IST

ములుగు నియోజకవర్గం గంగారం మండల కేంద్రంలో సీఎల్పీ బృందానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని చౌరస్తాలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు సీతక్క ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు నివాళులు అర్పించారు. ఆ తర్వాత సీఎల్పీ బృందం కాలేశ్వరం ముంపు ప్రాంతాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అయితే భూపాలపల్లి వద్ద వీరిని అడ్డుకున్న పోలీసులు భట్టి విక్రమార్కను అరెస్ట్ చేసారు.