ఈడి ఆఫీస్ ముందే భర్తను కౌగిలించుకుని... కల్వకుంట్ల కవిత భావోద్వేగం

న్యూడిల్లీ :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ(సోమవారం) ఈడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరయ్యారు.

| Updated : Mar 20 2023, 05:23 PM
Share this Video

న్యూడిల్లీ :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ(సోమవారం) ఈడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరయ్యారు.భర్త అనిల్ తో కలిసి ఈడి కార్యాలయం వద్దకు చేరుకున్న కవిత కాస్త భావోద్వేగానికి గురయ్యారు. కారు దిగగానే భర్త దగ్గరకు వెళ్లి కాస్సేపు కౌగిలించుకున్నారు. అనంతరం కవిత ఒక్కరే ఈడీ కార్యాలయంలోకి వెళ్లగా అనిల్ తో సహా ఆమె వెంట వచ్చినవారంతా బయటే వుండిపోయారు. డిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఈ నెల 16న ఈడీ విచారణకు హాజరుకావాల్సి వుండగా గైర్హాజరయ్యారు. దీంతో ఇవాళ (మార్చి 20 సోమవారం) హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.దీంతో ఇవాళ విచారణకు హాజరైన కవితను ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలున్నయన్న నేపథ్యంలో అసలేం జరుగుతుందోనని బిఆర్ఎస్ నాయకులతో పాటు ప్రతిపక్షాల్లో ఉత్కంఠ నెలకొంది.

Related Video