మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు... హమాలీ పని చేస్తూ బిజెవైఎం నిరసన

జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెవైఎం నాయకులు నిరసన చేపట్టారు. 

First Published Jul 20, 2021, 2:37 PM IST | Last Updated Jul 20, 2021, 2:37 PM IST

 జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెవైఎం నాయకులు నిరసన చేపట్టారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో బూట్లు పాలిష్ చేస్తూ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఇటీవల నిరుద్యోగులపై మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హమాలీలుగా మారి బస్తాలు మోసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం ఉద్యోగాలను భర్తీ చేయాలని బిజెవైఎం నాయకులు డిమాండ్ చేశారు.