బాలానగర్ ప్లైఓవర్ పై ఘోర ప్రమాదం... బైక్ అదుపుతప్పి లారీ డ్రైవర్ మృతి (సిసి వీడియో)
హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి నిర్మించి ఇటీవలే ప్రారంభమైన బాలానగర్ ప్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి నిర్మించి ఇటీవలే ప్రారంభమైన బాలానగర్ ప్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్లైఓవర్ మీద బైక్ పై అతివేగంగా వెళుతూ సేఫ్టీ గోడను ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన లారీడ్రైవర్ అశోక్ గా గుర్తించారు. హైదరాబాద్ కెపిహెచ్బి కాలనీలో ఉండే తన సోదరుడు ఇంటికి వచ్చిన అశోక్ లైసెన్స్ తీసుకునేందుకు తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి బైక్ పై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. బాలానగర్ ప్లైఓవర్ మీద అతివేగంగా వెళుతూ బైక్ అదుపుతప్పి సేఫ్టీ డివైడర్ ను ఢీ కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.