Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో అర్మాన్ మలిక్ కన్సర్ట్ ... విద్యార్థుల ఫ్లాష్ మాబ్..!

హైదరాబాద్‌లో విద్యార్థులు నడిపే అతిపెద్ద ఎన్జీవో స్ట్రీట్ కాజ్ వచ్చే నెల 8వ తేదీన మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నది. 

హైదరాబాద్‌లో విద్యార్థులు నడిపే అతిపెద్ద ఎన్జీవో స్ట్రీట్ కాజ్ వచ్చే నెల 8వ తేదీన మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మ్యూజిక్ ఈవెంట్ సాగనుంది.  ఈ మ్యూజిక్ ఈవెంట్‌లో ప్రముఖ బాలీవుడ్ సింగర్, కంపోజర్ అర్మాన్ మాలిక్ సందడి చేయబోతున్నారు. ఈ కన్సర్ట్ ప్రొమోషన్స్ లో భాగంగా స్టూడెంట్స్ ఫ్లాష్ మాబ్స్ నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన ఫండ్‌ను అణగారిన వర్గాల అభ్యున్నతికి తోడ్పాటుగా ఈ ఎన్జీవో ఖర్చు పెట్టనుంది.