
ఖోఖో వరల్డ్ కప్.. ఇండియా Vs భూటాన్ మ్యాచ్
ప్రపంచ దేశాల మధ్య సాగుతున్న ఖోఖో సమరంలో భారత్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఓవైపు పురుషులు, మరోవైపు మహిళలు అద్భుతంగా ఆడుతూ టైటిల్ దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఖోఖో ప్రపంచ కప్ 2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు... మరో విక్టరీ సాధించింది. గురువారం (జనవరి 16న) న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో భూటాన్ ను మట్టికరిపించి.. వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ మ్యాచ్ హైలైట్స్ చూసేయండి.