Asianet News TeluguAsianet News Telugu

పడిపోతున్న కెసిఆర్ గ్రాఫ్: తెలంగాణ సెంటిమెంట్ కు తూట్లు

తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రాఫ్ పడిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

First Published Jul 15, 2022, 11:00 AM IST | Last Updated Jul 15, 2022, 11:00 AM IST

తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రాఫ్ పడిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా బిజెపి పుంజుకుంటోంది. గత ఎన్నికల్లో కేవలం 6.9 శాతం ఓట్లు మాత్రమే రాబట్టుకున్న బిజెపి ప్రస్తుతం 28 శాతం పైచిలుకు సాధించే స్థాయికి ఎదిగిందని ఓ సర్వే తెలియజేస్తోంది. నిజానికి, తమ పార్టీకి కనీసం 30 శాసనసభ స్ణానాలు వస్తాయనే అంచనాతో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. తన గ్రాఫ్ ను క్రమంగా పెంచుకునే ఎత్తుగడలతో, వ్యూహాలతో ముందకు దూసుకుపోతోంది. కాంగ్రెస్ కూడా తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వైఎస్ షర్మిల నాయకత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా అది పావులు కదుపుతోంది. కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుండడానికి కారణాలేమిటో ఇక్కడ చూద్దాం.