Kuppam municipality election: కుప్పంలో షాక్, చంద్రబాబుకు ఎన్టీఆర్ ముప్పు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఇలాకా కుప్పంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. 

Share this Video

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఇలాకా కుప్పంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి కుప్పంలో Chandrababuను పూర్తిగా బలహీనపరచాలనే ఎత్తుగడతో ముందుకు సాగుతోంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పాగా వేసి చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చింది. గతంలో జరిగిన పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా Kuppam నియోజకవర్గంలో టీడీపీ ఘోరమైన ఫలితాలు సాధించింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ అంతర్గత పెరుగుతోంది. జూనియర్ NTR అందుకు ఏ మేరకు సిద్ధపడ్డారనే విషయం తెలియదు. తాను ఇప్పుడే రాజకీయాల్లోకి రాలేనని సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు తెలుస్తోంది.

Related Video