Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ పక్కా ప్లాన్: ఈటల రాజేందర్ కు షాక్ ఇచ్చే వ్యూహం

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఎంపిక చేయడం వెనక పక్కా వ్యూహం ఉంది. 

First Published Aug 13, 2021, 11:01 AM IST | Last Updated Aug 13, 2021, 11:01 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఎంపిక చేయడం వెనక పక్కా వ్యూహం ఉంది. ఈటల రాజేందర్ నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టి, గెలుపు దిశగా నడిపించేందుకు అనుగుణంగా అభ్యర్థిని ఎంపిక చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఉద్యమ నేపథ్యం ఉండడంతో పాటు ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. యువతతో కాకలు తీరిన రాజకీయ నేతలను తిప్పికొట్టే వ్యూహాలను రచిస్తూ కేసీఆర్ విజయం సాధిస్తున్నారు. హుజూరాబాద్ లో కూడా అదే చేయడానికి ఆయన సిద్ధపడినట్లు కనిపిస్తోంది.