Renuka Chowdhury Comments: పార్లమెంటులోకి కుక్కను తీసుకెళ్లొద్దని చట్టం ఉందా?

Share this Video

పార్లమెంట్‌కు కుక్కను తీసుకువచ్చిందని వచ్చిన విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ రెణుకా చౌదరి స్పందించారు. “పార్లమెంటుకు కుక్కను తీసుకు రాకూడదని ఎలాంటి చట్టం ఉంది? నేను వస్తుండగా స్కూటర్ ఒకటి కారును ఢీకొట్టింది. అక్కడ ఓ చిన్న పప్పీ రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. అది ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున కారులో పెట్టుకుని పార్లమెంట్‌ వరకూ వచ్చాను. తరువాత వాహనం వెళ్లిపోయింది, కుక్కను కూడా ఇంటికి పంపించాను. అంతే… దీనిపై ఇంత పెద్ద వివాదం ఎందుకు?" అని రేణుకా చౌదరి ప్రశ్నించారు."నిజంగా కరిచేవాళ్లు పార్లమెంట్‌లోనే కూర్చున్నారు… వాళ్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మేము ఒక మూగజీవిని కాపాడితే… అది పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వానికి ఇంకేమీ పని లేదా? ప్రతిరోజూ జనాలను కరిచేవారి గురించి ఎందుకు మాట్లాడటం లేదు?” అని రేణుకా చౌదరి ప్రశ్నించారు.

Related Video