
Mahakumbh 2025: కుంభమేళాలో రాష్ట్రపతి ముర్ము.. గంగమ్మకు ప్రత్యేక పూజలు
యూపీలోని ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి కుంభమేళాలో పాల్గొంటున్నారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కుంభ మేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం వద్ద స్నానం చేసి.. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు.