Gir National Park: లయన్ సఫారీలో ప్రధాని మోదీ | Asianet News Telugu
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్‌ను సందర్శించారు. ససన్ గిర్‌గా కూడా పిలువబడే ఈ అటవీ ప్రాంతం ఆసియాటిక్ సింహాలకు ప్రసిద్ధి. వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు గిర్ అడవి ఎంత ప్రాధాన్యమైనదో ఈ సందర్శన ద్వారా మోదీ చాటారు. గిర్ నేషనల్ పార్క్‌లో ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన గ్లింప్స్ చూసేయండి.