వీధుల్లో శిథిలాల కుప్పలు.. షాక్ లో మయన్మార్, థాయిలాండ్ ప్రజలు | Myanmar Earthquake | Asianet Telugu
బ్యాంకాక్, మయన్మార్ లో భారీ భూకంపాలు విధ్వంసం సృష్టించాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో భారీ భవనాలు కుప్పకూలాయి. భయాందోళనతో జనం కేకలు వేస్తూ ఇళ్లు, ఆఫీస్ ల నుంచి బయటకి పరుగులు తీశారు. కాగా, రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.7 నమోదయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించగా.. కళ్ల ఎదురె జరిగిన ఈ విపత్తును చూసిన ప్రజలు ఇంకా షాక్ లోనే ఉన్నారు.