PM Modi fire on Congress: వక్ఫ్ రూల్స్ స్వార్థానికి మార్చేసింది కాంగ్రెసే | Ambedkar Jayanti
కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. ముస్లింల పట్ల నిజంగా కాంగ్రెస్ కి శ్రద్ధ ఉంటే ఆ పార్టీ నాయకుడిగా నియమించాలన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ నివాళులర్పించారు. హర్యానాలోని హిసార్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించడాన్ని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ముస్లిం ఛాందసవాదులను సంతృప్తి పరచిందన్నారు. సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన స్వార్థానికి వక్ఫ్ రూల్స్ మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన రాజ్యాంగాన్ని ఆయుధంలా చేసుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసిందని మండిపడ్డారు.