ట్రంప్ ప్రమాణస్వీకారంలో మనకి అరుదైన గౌరవం Jaishankar in Trump Inauguration Ceremony | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Jan 23, 2025, 8:58 PM IST

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ రోటుండాలో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై ట్రంప్ కూర్చోనున్న నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులు, వ్యాపార దిగ్గజాలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఇండియాకు అరుదైన గౌరవం దక్కింది.