Delimitation JAC Meeting: స్టాలిన్ నేతృత్వంలో భేటీ.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ హాజరు | Asianet Telugu
తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ నాయకత్వంలో చెన్నైలో నేడు డీ లిమిటేషన్ జేఏసీ మీటింగ్ నిర్వహించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనపై తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నాయకులు, దక్షిణాది రాష్ట్రాల నేతలు, తదితరులు పాల్గొన్నారు. డీ లిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న అనుమానాల నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.