
Isha Foundation: మహాదేవునికి ఇచ్చే ఈ హారతి ఎంతో స్పెషల్
దేశ వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. జ్యోతిర్లింగాలు, ప్రముఖ శైవక్షేత్రాల్లో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని మహా శివునికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ లో సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మహా శివుడికి సమర్పించిన హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.