భారత స్వతంత్ర దినోత్సవం:  ఈ విషయాలు మీకు తెలుసా..?

ఆగస్టు 15, 1947 న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 

First Published Aug 14, 2020, 4:39 PM IST | Last Updated Aug 14, 2020, 4:39 PM IST

ఆగస్టు 15, 1947 న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి దేశాన్ని బానిస సంకెళ్ళ నుంచి విడిపించారు.  అనే ఆయుధంతో ఆంగ్లేయులను దేశం నుండి వెళ్లగొట్టారు. కానీ తొలి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మహాత్మా గాంధీ  పాల్గొనలేదు. మహాత్మా గాంధీ ఆ రోజున ఢిల్లీ కి దూరంగా  బెంగాల్ లోని నోఖాలిలో హిందువులు, ముస్లింల మధ్య చెలరేగిన మతఘర్షణలు, విభజన గొడవలను నివారించడానికి ఉపవాస దీక్షలో ఉన్నారు. ఆగస్టు 15 న స్వాతంత్ర దినోత్సవంగా నిర్ణయించి జవహర్‌లాల్ నెహ్రూ , సర్దార్ వల్లభాయ్ పటేల్ లు జాతిపిత మహాత్మా గాంధీకి  బెంగాల్ నుంచి వచ్చి మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు ఆశీర్వాదం ఇవ్వండి  అని ఒక లేఖ పంపారు. హిందూ-ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటుంటే....  తాను ఎలా స్వతంత్ర దినోత్సవాన్ని  జరువుకోగలనని బదులిచ్చాడు.