నిజంగానే నాయక్... కన్న కూతురి కోసం... చిరుత పులిని చంపిన తండ్రి

కర్ణాటక రాష్ట్రంలోఓ వ్యక్తి భార్య, కుమార్తెను కాపాడుకునేందుకు ఏకంగా చిరుతపులితో తలపడి చంపేశాడు. 

First Published Feb 23, 2021, 4:50 PM IST | Last Updated Feb 23, 2021, 4:50 PM IST

కర్ణాటక రాష్ట్రంలోఓ వ్యక్తి భార్య, కుమార్తెను కాపాడుకునేందుకు ఏకంగా చిరుతపులితో తలపడి చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్‌ జిల్లా హరిసెక్రె తాలుకా బెండాక్రె ప్రాంతంలో చోటు చేసుకుంది. రాజ్‌గోపాల్‌ నాయక్‌ భార్యా, కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఒక్కసారిగా వారిపై చిరుత పులి దాడి చేసింది. ఈ క్రమంలో ముగ్గురు బైక్ మీద నుంచి కిందపడిపోయారు. వెంటనే చిరుత వారిపై దాడి చేసింది. దీంతో చిరుత బారి నుంచి భార్య, కుమార్తెను రక్షించుకునేందుకు రాజ్‌గోపాల్‌ నాయక్‌ వీరోచిత పోరాటం చేశాడు. ఇలా ప్రాణాలకు సైతం తెగించి చివరకు చిరుతనే హతమార్చి తమ ప్రాణాలను రక్షించుకున్నాడు. అప్పటికే పులి దాడిలో తీవ్రంగా గాయపడిన అతని భార్య, కుమార్తెతో సహా రాజ్‌గోపాల్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.