
Tamilanadu rains: చెన్నైలో భారీ వర్షం.. ఆరెంజ్ హెచ్చరిక జారీ
తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తూత్తుకుడి సహా అనేక ప్రాంతాల్లో వానలు దంచి కొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.