చంద్రయాన్: మిత్ర క్రేటర్ ఏమిటి, ఎవరతను? (వీడియో)
Aug 28, 2019, 5:27 PM IST
చంద్రయాన్ చంద్రుడి కక్ష్యలోకి వెళ్ళినప్పటినుండి చంద్రుడి ఫోటోలను పంపిస్తూనే ఉంది. తాజాగా చంద్రయాన్ పంపిన ఒక చిత్రాన్ని ట్వీట్ చేస్తూ మిత్ర క్రేటర్ అని ప్రత్యేకంగా రాసింది ఆల్ ఇండియా రేడియో. ఇంత ప్రత్యేకంగా ఆల్ ఇండియా రేడియో ఎందుకు ట్వీట్ చేసింది? ఆల్ ఇండియా రేడియోకి మిత్రాకు ఉన్న సంబంధం ఏంటి?
శిశిర్ మిత్ర, మనలో ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. రేడియో సైన్స్ పైన ఇతని విస్తృత స్థాయి పరిశోధన కారణంగానే నేడు భారత్ టెలీకమ్యూనికేషన్ రంగంలో దూసుకుపోతుంది. ఆల్ ఇండియా రేడియో ప్రారంభమవ్వడానికి సంవత్సరం ముందే కళాశాలలోని తన ల్యాబ్ నుండి రేడియో ప్రసారాలను మొదలుపెట్టాడు.