ధ్వంసం చేసానన్న సెల్ ఫోన్లు ఇవే..: ఈడికే షాక్ ఇచ్చిన కవిత

న్యూడిల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడి కార్యాలయానికి వెళ్లేముందు సంచలన విషయాలు బయటపెట్టారు. 

First Published Mar 21, 2023, 12:40 PM IST | Last Updated Mar 21, 2023, 12:40 PM IST

న్యూడిల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడి కార్యాలయానికి వెళ్లేముందు సంచలన విషయాలు బయటపెట్టారు. డిల్లీ లిక్కర్ స్కాం పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన దర్యాప్తు నిస్పక్షపాతంగా జరగడం లేదని... రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా జరుగుతోందని కవిత ఆరోపించారు. తనకు లిక్కర్ స్కాంతో సంబంధాలున్నట్లు... తాను వాడిన ఫోన్లను ధ్వంసం చేసానంటూ ఈడీ ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. తనను విచారించకుండానే ఫోన్లు ధ్వంసం చేసానని దర్యాప్తు సంస్థ ఆరోపణలు చేసింది...  ఇందులో ఏమాత్రం నిజం లేదని కవిత అన్నారు. ఈ మేరకు తాను ధ్వంసం చేసానని అంటున్న మొబైల్ ఫోన్లను ఈడికి సమర్పించనున్నట్లు దర్యాప్తు అధికారి జోగేంద్ర కు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ఈడి దురుద్దేశపూర్వకంగా వ్యవహరించినా తాను వారికి సహకరిస్తున్నానని... అందుకే ఫోన్లను స్వాధీనం చేస్తున్నానని అన్నారు. ఈ మేరకు ఈడి విచారణకు వెళ్లేముందు కవిత సెల్ ఫోన్లను మీడియాకు ప్రదర్శించారు.