మునాంబం వాసులకు బీజేపీ సభ్యత్వం.. భూ హక్కులపై రాజీవ్ చంద్రశేఖర్ భరోసా | Asianet News Telugu
కేరళలోని మునాంబంలో భూ సమస్యలపై పోరాడుతున్న వారికి భారతీయ జనతా పార్టీ అండగా నిలిచింది. తమ ఆస్తులను వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుందని కొన్నాళ్లుగా ఆమునాంబంలోని 50 కుటుంబాలు పోరాటం చూస్తున్నాయి. వారి పోరాటానికి బీజేపీ కేరళ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, ఎన్డీఏ నేత తుషార్ వెల్లపల్లి మద్దతు తెలిపారు. మునంబం నిరసన స్థలానికి చేరుకుని... భూ సమస్యలు ఎదుర్కొంటున్న 50 మందికి బిజెపి సభ్యత్వం ఇచ్చారు. మునాంబం నివాసితులకు భూములపై హక్కులు లభించే వరకు అండగా ఉంటానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు.