ప్రభావశీలమైన జర్నలిజంలో పాతికేళ్ల ప్రస్థానం.. ఏసియా నెట్ న్యూస్...
పాతికేళ్లు..ఏడు భాషలు.. ఏసియానెట్ న్యూస్ ప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. పాతికేళ్ల క్రితం మలయాళంలో టీవీ ఛానల్ గా మొదలై, కన్నడలో సువర్ణ న్యూస్ గా అవిచ్ఛిన్నమైన ఆధిపత్యంతో ముందుకు సాగుతోంది. నాలుగేళ్ల క్రితం డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఆసియానెట్ న్యూస్ నేడు, నెలకు 750 మిలియన్ పేజ్ వ్యూస్ తో ఏడు భాషల్లో టాప్ 10 వార్తా వేదికల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. విశ్వసనీయమైన సమాచారానికి వేదికగా మారింది.