Aero India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ఎయిర్ షో.. అద్భుతమైన యుద్ధ విమాన ప్రదర్శనలు | Asianet Telugu
Aero India 2025: భారతదేశ అతిపెద్ద వైమానిక ప్రదర్శన Aero India 2025 బెంగుళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాయుసేన అధికారులు, రక్షణ రంగ నిపుణులు, పరిశ్రమ ప్రముఖులు పాల్గొని ఆవిష్కరణలను, కొత్త భాగస్వామ్యాలను, భవిష్యత్తు టెక్నాలజీలను వివరించారు. అత్యాధునిక వైమానిక విన్యాసాలు, అత్యుత్తమ యుద్ధ విమాన ప్రదర్శనలు ఈ కార్యక్రమానికి హైలైట్ గా మారాయి.