పున్నాప్ర తిరుగుబాటు - రామస్వామి అయ్యర్ కి వ్యతిరేకంగా కమ్యూనిస్టు తిరుగుబాటు

స్వ‌దేశీ, విదేశీ పాల‌న‌కు వ్య‌తిరేకంగా జరిగిన మొద‌టి పోరాటం ‘వాయిల‌ర్ తిరుగుబాటు’

 

First Published Jul 10, 2022, 12:15 PM IST | Last Updated Jul 10, 2022, 12:15 PM IST

స్వ‌దేశీ, విదేశీ పాల‌న‌కు వ్య‌తిరేకంగా జరిగిన మొద‌టి పోరాటం ‘వాయిల‌ర్ తిరుగుబాటు’భార‌త దేశానికి స్వ‌తంత్ర వచ్చే స‌మ‌యంలో దేశంలో అనేక సంస్థానాలు ఉన్నాయి. వాటిని ఇండియ‌న్ యూనియ‌న్ లో విలీనం చేసేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే ఈ ప్ర‌య‌త్నాలకు కొంద‌రు రాజులు ఒప్పుకుంటే మ‌రి కొంద‌రు దానిని తిర‌స్క‌రించారు. ఇలా తిర‌స్క‌రించిన రాజ్యాల్లో తిరువితంకూర్ ఒక‌టి. ఇది స్వ‌తంత్రంగానే ఉండాల‌ని అనుకుంది.1946 స‌మ‌యంలో తిరువితంకూర్ మహారాజా చిత్రతిరుణాళ్ బలరామవర్మ ఉన్నారు. ఆయ‌న‌కు దివాన్ గా స‌ర్ సీపీ రామ‌స్వామి అయ్య‌ర్ గా వ్య‌హ‌రించేవారు. వీరు త‌మ రాజ్యాన్ని భార‌త యూనియ‌న్ లో విలీనం చేయ‌కూడ‌ద‌ని భావించారు. అయితే ఆ స‌మ‌యంలో జ‌రిగిన రెండో ప్ర‌పంచ యుద్ధం ఫ‌లితంగా తీవ్ర ఆహార కొర‌త ఏర్ప‌డింది. ఇత‌ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల వ‌ల్ల ఐదేళ్లలో ఆ రాజ్యంలో 20,000 మందికి పైగా మరణించారు. అయిన‌ప్పటికీ భూస్వాములు పోలీసుల సహాయంతో తమ క్రూరమైన దోపిడీని కొనసాగించారు. దీనిని భరించలేక కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రజలు ఎదురుదాడికి దిగారు. ఈ దాడిలో ఓ పోలీసు మృతి చెందాడు. ఆ స‌మ‌యంలో రైతులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మనుగడ కోసం పోరాటంగా ప్రారంమైన ఈ ఆందోళ‌న స్వతంత్ర రాజ్యం కోసం, రాచరిక పాల‌న అంతం కోసం ఒక రాజ‌కీయ పోరాటంగా మారింది. 1946 అక్టోబ‌ర్ 25 మహారాజా జన్మదినం జ‌రిగిన రెండు రోజుల త‌రువాత పొరుగున ఉన్న వాయలార్ వద్ద రైతులు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. దీంతో దివాన్ కు కోపం వ‌చ్చింది. ఈ తిరుగుబాటును అణచివేయాలని ఆయ‌న నిర్ణ‌యించుకున్నాడు. అక్టోబర్ 27న ఈ ప్రాంతంలో మార్షల్ లా ప్రకటించాడు. సైన్యం, పోలీసు దళాల పెద్ద బృందం వయలార్ ను చుట్టుముట్టింది. ఈ ప్రాంతానికి మూడు వైపుల నీరు ఉంటుంది. దీంతో గ్రామంలో రైతులు చిక్కుకుపోయారు. కేవ‌లం వారి వ‌ద్ద ఉన్న క్రూరమైన ఆయుధాలతో రైతులు పోరాటం చేశారు. సైన్యం కాల్పులు జ‌రుపుతున్నా దానికి ధీటుగా నిల‌బ‌డ్డారు. గంట‌ల త‌రబ‌డి పోరాడారు. దీంతో 500 మృతదేహాలు ఆ ప్రాంతంలో చెల్ల చెదురుగా ప‌డిపోయాయి. వాయలార్ తీర ప్రాంతంలో ఉన్న తెల్ల‌టి ఇసుక ర‌క్తంతో ఎర్ర‌గా మారిపోయింది. మృతదేహాలను సామూహిక సమాధుల్లో పడేశారు.పున్నప్రా వాయలార్ తిరుగుబాటు స్థానిక రాచరిక ప్రభుత్వంతో పాటు విదేశీ వలసవాదులు రెండింటికీ నిర‌సిస్తూ జరిగిన ఆందోళన. పేదరికానికి, భూస్వాముల చిత్రహింసలకు వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటన ఉద్యమం ఇది. స్వదేశీ, విదేశీ అధికారులకు వ్యతిరేకంగా సంఘటిత కార్మికవర్గం చేసిన మొదటి ఉద్యమం కూడా ఇదే.  పున్నప్రా వాయలార్ అణచివేత భారతదేశం స్వాతంత్రం పొందడానికి రెండు నెలల ముందే జ‌రిగింది. ఈ ఆందోళ‌న అణిచిపెట్ట‌డం వ‌ల్ల స్వ‌తంత్ర రాజ్యంగా కొన‌సాగ‌వ‌చ్చ‌ని రాచరిక ప్రభుత్వానికి ధైర్యం వ‌చ్చింది. కానీ ఒక విప్ల‌వకారుడు దివాన్ సర్ సీపీపై దాడి చేసి తీవ్రంగా గాయపడ్డాడు.దీంతో దివాన్ వెంట‌నే తిరువితంకూర్ నుండి మద్రాసులోని తన ఇంటికి బయలుదేరాడు. తిరిగి రాలేదు. ఒక వారం తరువాత మహారాజు త‌న రాజ్యాన్ని భారత యూనియన్ లో విలీనం చేయడానికి అంగీకరించాడు.