Asianet News TeluguAsianet News Telugu

దేశం కోసం అతి పిన్న వయసులోనే ప్రాణాలు వదిలిన వీరుడు అష్ఫాకుల్లా ఖాన్

విదేశీ పాలకుల సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించడానికి ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమర యోధుడు అష్ఫకుల్లా ఖాన్.

విదేశీ పాలకుల సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించడానికి ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమర యోధుడు అష్ఫకుల్లా ఖాన్. ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్‌లో పఠాన్ కుటుంబంలో జన్మించిన అష్ఫకుల్లా ఖాన్ చిన్న వయసులో స్వాతంత్ర్య పోరాటం వైపు అడుగులు వేశారు. హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను భగత్ సింగ్‌తో కలిసి స్థాపించారు. చౌరీ చౌరా హింసతో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేయడంతో నిరాశపడ్డవారిలో అష్ఫకుల్లా ఖాన్ ఒకరు. సాయుధ పోరాటంతోనే విదేశీ పాలనను అంతమొందించాలని ఆయన బలంగా అనుకున్నారు. అందుకే ఓ కొత్త సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థకు నిధుల కోసం వారు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టాలనుకున్నారు.

1925 ఆగస్టు 9న అష్ఫకుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, మరికొందరు మిత్రులు కలిసి లక్నోలోని కకోరీలో ప్రభుత్వ ట్రైన్‌ను దోపిడీ చేశారు. ఇది కకోరి ఘట్టంగా చరిత్రలో ప్రతీతి. ఖాన్ పోలీసుల నుంచి తప్పించుకుని ఢిల్లీ చేరుకున్నారు. దేశాన్ని వదిలేముందు ఓ మిత్రుడి ద్రోహం కారణంగా పోలీసులకు ఆయన ఆచూకీ తెలిసిపోయింది. కకోరీ కేసులో ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, రోషన్ సింగ్, ఇతరులతో కలిపి అష్ఫకుల్లా ఖాన్‌కు ఫైజాబాద్ జైలులో 1927 డిసెంబర్ 19న మరణ శిక్ష అమలు చేశారు. హిందీలో వచ్చిన ప్రసిద్ధ చిత్రం రంగ్ దే బసంతి.. అష్ఫకుల్లా ఖాన్, ఆయన కామ్రేడ్ల జీవితాల ఆధారంగా తెరకెక్కినదే. అష్ఫకుల్లా ఖాన్ పేరిట ఉత్తరప్రదేశ్‌లో రూ. 230 కోట్లతో ఓ జూలాజికల్ గార్డెన్ నిర్మిస్తున్నారు