Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్ న్యూస్- ఎన్ సి సి వజ్ర జయంతి యాత్ర : యుద్ధ ట్యాంకుపై క్యాడెట్లు

ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ చేపట్టిన వజ్ర జయంతి యాత్ర అనేక విశిష్టతలతో ముందుకు సాగుతున్నది. 

First Published Jun 16, 2022, 6:21 PM IST | Last Updated Jun 16, 2022, 6:21 PM IST

ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ చేపట్టిన వజ్ర జయంతి యాత్ర అనేక విశిష్టతలతో ముందుకు సాగుతున్నది. రెండో రోజు తిరువనంతపురంలో పంగోడ్‌లోని ఆర్మీ బ్రిగేడ్‌లో ఎన్నో  విషయాలను పరిశీలించిన పార్టిసిపేంట్లు ఇప్పుడు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ చేరుకున్నారు. ఇక్కడ దేశంలోని అంతరిక్ష పరిశోధకులతో వారు ఇంటరాక్ట్ అవుతారు.

పంగోడ్ క్యాంప్‌లో ఈ యాత్రలో పాల్గొన్న క్యాడెట్లు ఒక రోజు సైనికుడు జీవితం ఎలా ఉంటుందో దగ్గరగా చూశారు. యుద్ధ ట్యాంక్ పైనా రైడ్ చేశారు. బీఎంపీ 2 వర్షన్‌కు చెందిన బ్యాటిల్ ట్యాంక్‌లోకి క్యాడెట్లను అనుమతించారు. రష్యాలో తయారు చేసిన ఈ ట్యాంకులో ఉద్విగ్నంగా గడిపిన క్షణాలను క్యాడెట్లు ఎంతో ఉత్సాహంగా పంచుకున్నారు. తమ జీవితంలో అద్భుత క్షణాలుగా ఇవి నిలిచిపోతాయని వారు అన్నారు.

అంతేకాదు, ఆర్మీ ఇటీవలే చేర్చుకున్న 762 జిగ్మా రైఫిల్స్, ఇతర ఆయుధాలకు సంబంధించిన వివరాలను క్యాడెట్లకు తెలిపారు. వారి జిగ్మా రైఫిల్ ఉపయోగించి వివిధ పద్ధతుల్లో జరిపై ఫైరింగ్‌ను చూపెట్టారు. సాధారణ ఎన్‌సీసీ క్యాంపుల్లో ఇలా ఆయుధాల ప్రదర్శన ఇవ్వరు. ఇలా అనేక విశిష్టతలను ఈ యాత్ర పొందుతూ ముందుకు సాగుతున్నది.

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో క్యాడెట్లకు అక్కడి ఫెసిలిటీల గురించి వివరిస్తారు. దేశ అంతరిక్ష పరిశోధనల్లో దాని ప్రముఖ పాత్రను చెబుతారు. ఈ యాత్ర సదరన్ నావల్ కమాండ్, ఇండియన్ నావల్ అకాడమీలను త్వరలో పర్యటించనుంది.